Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, దేహ్రాదూన్ కొత్త సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. సింథటిక్ అపార్చుర్ రాడార్ డేటా ప్రాసెసింగ్‌పై అందిస్తున్న ఈ కోర్సులో విద్యార్థులతో పాటు పరిశోధకులు, ప్రభుత్వ సైంటిఫిక్ సిబ్బంది చేరొచ్చు. ఆసక్తిగల వారు ఆన్లైన్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
ఈ ఐఐఆర్ఎస్ అందిస్తున్న ఈ కోర్సు పూర్తిగా ఉచితం. ఇది ఏప్రిల్ 10న ప్రారంభమై ఏప్రిల్ 14తో ముగుస్తుంది. ఒక్కో సెషన్ గంటన్నరపాటు సాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 మధ్య ఆన్లైన్ సెషన్ ఉంటుంది. ఈ కోర్సులో పాల్గొనదలిచిన వారు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. మరిన్ని వివరాల కొరకు https://elearning.iirs.gov.in/edusatregistration/ వెబ్సైట్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలి.