Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
బీజేపీలో చేరిన ఉమ్మడి ఎపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షాను కలిసిన ఆయన తాజా రాజకీయాలపై కొద్దిసేపు చర్చించారు. నడ్డా నివాసంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను కూడా కలిశారు.
ఈ తరుణంలో నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్, యడ్యూరప్ప, కర్ణాటక సీఎం బొమ్మై సమావేశమై కర్ణాటక ఎన్నికలపై చర్చించారు. వీరితో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, అభ్యర్థుల ఖరారు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కిరణ్ కుమార్‌రెడ్డికి పలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు బెంగళూరు కేంద్రంగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలు వినియోగించుకోవాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.