Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పాక్‌తో సంబంధంతో సంబంధమున్న ముగ్గురు ఉగ్రవాదులు ముంబయిలోకి ప్రవేశించారని, నగరంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దాంతో ఒక్కసారిగా పోలీస్‌శాఖలో కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం పాక్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు దుబాయి మీదుగా ముంబయికి వచ్చినట్లుగా ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్లో సమాచారం అందించాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఇటీవల ముంబయిలో ఉగ్రవాదులు ప్రవేశించారని, బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి నగరంలో ఉగ్రవాదులు ప్రవేశించారని కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో.. ఫేక్ కాలా? వాస్తవమేనా? తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను అధికారులు రంగంలోకి దింపారు.