Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ లీగల్ నోటీసును వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కౌంటర్ సమాధానం పంపారు. గత నెల 28న రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ప్రతిగా రేవంత్‌రెడ్డి ఏడు పేజీల సమాధానమిచ్చారు.
ఈ తరుణంలో మీ క్లయింట్ సరైన వివరాలు మీకు అందించలేదు. మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో సరిగా వినపడట్లేదు అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని, తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని ఈ దేశంలో లేనందున ఆ బాధ తెలియదన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరఫున మాట్లాడానని తెలిపారు. టీఎస్పీఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీశాఖ అందిస్తుందని, అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పలు వివషయాలపై దాదాపు ఏడు పేజీల సమాధానమిచ్చారు.