Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మనకు నచ్చిన విషయాలు, మన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇప్పుడు అందరూ దాదాపు వాట్సాప్ స్టేటస్‌ను విరివిగా వాడుతున్నారు. ఇదే వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోనూ స్టోరీగా పెట్టుకోవాలంటే మన స్టేటస్‌లోని షేర్ ఆప్షన్ వాడాలి. లేదంటే మళ్లీ ఫేస్బుక్లో ప్రత్యేకంగా అప్లోడ్ చేయాలి. వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఏక కాలంలో వాట్సాప్ స్టోరీతో పాటు ఫేస్బుక్ స్టోరీని పెట్టుకోవచ్చు.
వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో‘My Contacts, My Contacts Except.., Only Share With.. ఇలా మూడు ఆప్షన్లు ప్రస్తుతం కనిపిస్తాయి. ఇకపై వాటి కింద Facebook అనే కొత్త ఆప్షన్ రానుంది. రెండు సామాజిక మాధ్యమాల్లో స్టేటస్ పెట్టాలనుకొనే వారు ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకొని ఫేస్బుక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. దీంతో ఫేస్‌బుక్‌ను ప్రత్యేకంగా ఓపెన్ చేసే పని లేకుండానే రెండింటిలోనూ ఒకేసారి స్టేటస్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను ఆప్షనల్‌గానే వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.