Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లో `ఎక్స్` సిరీస్ ఫోన్లు ఈ నెలాఖరులోగా ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ స్క్రీన్‌తో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ఫోన్లు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ నెల 26న భారత్ మార్కెట్లో ప్రవేశించనున్నాయి. వీటి ధరలు రూ.60 వేల నుంచి రూ.80 వేల మధ్య ఉండొచ్చునని అంచనా. గత నవంబర్లోనే చైనా మార్కెట్లో వివో ఎక్స్90, వివో ఎక్స్ 90 ప్రో ఫోన్లను ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్లోనూ అందుబాటులో ఉన్నాయి.
వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ఫోన్లు రెండు కూడా కస్టమ్ వీ2 చిప్ ఇమేజ్ ప్రాసెసింగ్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. వివో ఎక్స్90 ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 866 ప్రైమరీ సెన్సర్, 12-మెగా పిక్సెల్ పొట్రెయిట్ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా కలిగి ఉన్నాయి. ఇంకా వివో ఎక్స్90 ప్రో ఫోన్ కూడా 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 989 ప్రైమరీ సెన్సర్, 50-మెగా పిక్సెల్ 50మి.మీ ఐఎంఎక్స్ 758 సెన్సర్, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తున్నది. రెండు ఫోన్ల ఫ్రంట్‌లోనూ 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తున్నది. వివో ఎక్స్90 ఫోన్.. 4,810ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వివో ఎక్స్ 90 ప్రో ఫోన్ ..4,870 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్లెస్ చార్జింగ్‌తో వస్తున్నాయి.