Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30గంటలకు హైదరాబాద్ - పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందని.. ఉప్పల్ ‘స్టేడియం’ స్టేషన్ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మిగతా స్టేషన్లలో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు నుంచి ఉప్పల్‌కు ఎక్కువ సర్వీసులు తిరుగుతాయని మెట్రో రైలు అధికారులు చెప్పారు. రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్ ఈ సీజన్లో బోణీ కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో ఉత్సాహంగా ఉంది.