Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్గొండ
తిప్పర్తి మండలం, సర్వారంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు చిరబోయిన శంకర్ (25)ను కత్తితో పొడిచి చంపేశాడు ఓ యువకుడు. శంకర్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అదే గ్రామానికి చెందిన మదుసూధన్కు కూడా ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ తరుణంలో మదుసూధన్ భార్యతో శంకర్‌కు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో గత కొద్ది కాలంగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
అయితే శనివారం మధ్యాహ్నం ఇద్దరూ వేర్వేరుగా మద్యం సేవించేందుకు వెళ్లారు. దీంతో అక్కడ శంకర్ మదుసూధన్ భార్యకు ఫోన్ చేయడాన్ని గమనించిన మదుసూధన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శంకర్‌పై దాడికి దిగాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని అడ్డుకుని ఇంటికి పంపివేశారు. అయినా మదుసూధన్ శంకర్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మదుసూధన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.