Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
బీజేపీ అనుకూల రాజకీయాలకు పాల్పడుతోందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం తెలంగాణలో చేసిన వ్యాఖ్యలపై సిబల్ మండిపడ్డారు. కుటుంబపాలనే అవినీతికి మూలమని తెలంగాణలో పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో నరేంద్రమోడీ అన్నారు. కుటుంబపాలన, అవినీతి కలిసే ఉంటాయని ఆ రెండింటితో మమేకమైన వ్యక్తులు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ను ప్రధాని విమర్శిస్తూ.. అవినీతి, కుటుంబపాలన కలిసే ఉంటాయన్నారు. పంజాబ్లో అకాలీలు, ఆంధ్రలో జగన్, హరియాణాలో చౌతాలాలు, జమ్మూకశ్మీర్లో ముఫ్తీలు, మహారాష్ట్రలో ఠాక్రేలతో బీజేపీ కలిసినప్పుడు వారివి వారసత్వ రాజకీయాలు కాదా? దీన్నే అనుకూల రాజకీయాలు అంటారు అని సిబల్ విమర్శించారు. అదే సమయంలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’పై కూడా భాజపా అవినీతి ఆరోపణలు చేస్తోంది కదా అని గుర్తుచేశారు. కానీ, అక్కడ వారసత్వ రాజకీయాలు లేవని టీట్టర్ వేదికగా స్పందిచారు.