Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిసిసి మేనేజర్ జాటోత్ దేవ్
నవతెలంగాణ - తాడ్వాయి
తాడ్వాయి మండలంలో అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభమైందని జిసిసి మేనేజర్ జాటోత్ దేవ్ తెలిపారు. ఆదివారం ఆదివాసి గ్రామాలలో ఇప్పపువ్వు, అడవి ఉత్పత్తులు సేకరిస్తున్న ఆదివాసి కుటుంబాల తో కలిసి వారికి అడవి ఉత్పత్తుల సేకరణపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిసిసి మేనేజర్ జాటోత్ దేవ్ మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతిలో ఇప్పపువ్వు, ముష్టి గింజలు, తేనె, చీపుర్లు చింతపండు చిల్లగింజలు, ఉసిరి, తప్సి జిగురు మొదలగు అటవీ ఉత్పత్తులను సేకరించాలని అవగాహన కల్పించారు.
అడవి ఉత్పత్తులను దళారులకు తక్కువ ధరకు విక్రయించే రాదని పేర్కొన్నారు. జిసిసి ద్వారానే కొనుగోలు చేసి ఆదివాసి కుటుంబాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా సహాయ పడుతుందన్నారు. తేనే రూ. 225, విప్పపువ్వు రూ. 30, చింతపండు రూ. 70, విషముష్టి గింజలు 45 రూపాయలు, చిల్లగింజలు 35 రూపాయలు, గిరిజనులు తాము సేకరించిన ఉత్పత్తులను గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘాలకు కొనుగోలు కేంద్రంలో యందు మరియు నిత్యవసర వస్తు విక్రయశాలలయందు పై ధరలకు రశీదు పొందాలని తెలిపారు. అటవీ ఉత్పత్తులను బయట విక్రయించే వద్దని సూచించారు. గిరిజన గ్రామాల్లో వందనం వికాస్ కేంద్ర అటవీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి సిబ్బంది, ఆదివాసి గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.