Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేవలం రాజకీయాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పై ప్రధాని మోడీ విమర్శలు చేసిన క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.
దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్స్టైల్ పార్క్, ప్రపంచ వ్యాక్సిన్ హబ్‌లు తెలంగాణ ప్రత్యేకతలు. రాష్ట్ర యువత కోసం అత్యధిక ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాం. దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించాం. వరి ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి మోడీ నోటి నుంచి ఒక్క అభినందనా రాలేదు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణతో సమానంగా వృద్ధి చెందిన ఒక్క రాష్ట్రాన్ని చూపించగలరా? అంటూ మోడీకి కేటీఆర్ సవాల్ విసిరారు.