Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్-2023 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన బంతి రికార్డైంది. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ లోకీ ఫెర్గూసన్ ఐపీఎల్-2023 ఫాస్టెస్ట్ డెలివరీ సంధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌల్ చేసిన ఫెర్గూసన్ గిల్ ఎదుర్కొన్న రెండో బంతిని గంటకు 154.1 కిమీ బుల్లెట్ వేగంతో సంధించాడు. తొలి బంతిని 149 కిమీ వేగంతో, మూడో బంతిని 150.15 కిమీ వేగంతో, నాలుగో బంతిని 151.4 కిమీ వేగంతో సంధించి, పేస్‌కా సుల్తాన్ అనిపించుకున్నాడు.
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ విజయ్ శంకర్ (63) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (53) అర్ధసెంచరీతో రాణించగా, శుభ్‌మన్ గిల్ (39) పర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్‌కు 3, సుయాశ్ శర్మకు ఓ వికెట్ దక్కింది.