Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగ నియామక పరీక్ష కేవలం ఇంగ్లిష్, హిందీలో నిర్వహించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం లేకపోవడం వివక్ష, ఏకపక్షమని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఉద్యోగ నోటిషికేషన్ ప్రకారం అభ్యర్థులు కేవలం ఇంగ్లిష్, హిందీలోనే పరీక్ష రాయాల్సి వస్తుంది. దీంతో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం లేకుండా పోతోంది. ఇది ఏకపక్షంగా ఉండటమే కాకుండా వివక్ష చూపించడమే అని అమిత్ షాకు రాసిన లేఖలో స్టాలిన్ తెలిపారు. ఈ రకమైన పరీక్ష నిర్వహణతో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అవుతారని ఇది ఔత్సాహికుల రాజ్యాంగ హక్కుకు వ్యతిరేకమని ఎంకే స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.