Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులు వరుస భూ ప్రకంపనాలతో వణికిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది. ఏప్రిల్ 6 న అండమాన్, నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. రాత్రి 10:47 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది.