Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 16వ సీజన్ 14 వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఢీ కొంటున్నాయి. ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ సొంత గ్రౌండ్లో ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది. వరుస విజయాలతో జోరు మీదున్న శిఖర్ ధావన్ సేన హ్యాట్రిక్ మీద గురి పెట్టింది. దాంతో, ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ తరుణంలో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ మర్క్రం ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.