Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 16వ సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో రషీద్ ఖాన్‌కు ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. అయితే గుజరాత్ టైటాన్స్ తరపున కూడా ఇదే తొలి హ్యాట్రిక్ కావడం మరో విశేషం. నే
టి మ్యాచ్ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ తొలి బంతికి రసెల్‌ను, రెండో బంతికి సునీల్ నరైన్‌ను, మూడో బంతికి శార్దూల్ ఠాకూర్‌ను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన 19వ బౌలర్‌గా రషీద్ నిలిచాడు. అత్యధికంగా ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు. అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేయగా ఆ తర్వాత యువరాజ్ సింగ్ రెండుసార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు.