Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో చెన్నై- ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. రైల్లో ఉన్నట్లుండి పొగలు రావడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. చెన్నై నుంచి ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ బీ-5 బోగీలో నుంచి పొగలు రావటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు.
రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే రైలును కావలి రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ఈ తరుణంలో రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై విచారణ జరిపిన రైల్వే అధికారులు బ్రేక్ జామ్ కారణంగానే పొగలు వెలువడ్డాయని తెలిపారు. రైలు మరమ్మతులు చేసిన తర్వాత మళ్లీ ప్రయాణం ప్రారంభించామన్నారు.