Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్లు 24గంటలూ తెరిచి ఉంచేందుకు వీలు కల్పించే ఉత్తర్వులు (జీఓఎంఎస్-4) ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖకు వర్తించవని ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
అయితే ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం నిర్దేశించిన సమయాల్లోనే టీఎస్ బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టలరీలు, బ్రివరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు తెరిచి ఉంటాయని తెలిపింది. 24గంటలపాటు దుకాణాలను తెరిచి ఉంచే విధానం దేశంలోని న్యూఢిల్లీ, ముంబయి, బెంగుళూరు తదితర మెట్రో నగరాల్లో అమలులో ఉందని, ప్రభుత్వం ఈ నెల 4న విడుదల చేసిన జీఓఎంఎస్-4 తెలంగాణ రాష్ట్ర దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్-1988కి లోబడే ఉందని తెలిపింది. అంతేకాకుండా ఈ ఉత్తర్వులు అన్ని దుకాణాలకు యథావిధిగా వర్తించవని, ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.