Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో కోవిడ్-19 వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. ఏప్రిల్ 9 నాటికి దేశంలో వైరస్ యొక్క క్రియాశీల కేసులు 32,000 దాటాయి. పలు రాష్ట్రాల్లో కేసులు గతంలో కంటే రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ, రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్, ఝజ్జర్‌లో మాక్ డ్రిల్స్‌ను పర్యవేక్షిస్తారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్‌ను పర్యవేక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను అభ్యర్థించారు.