Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. ప్రబ్యూటీ బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ భర్త విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు వార్డెన్ భర్తపై కేసు నమోదు చేశారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉన్న విద్యార్థినుల పట్ల వార్డెన్ శశిరేఖ భర్త రవి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినుల ఫిర్యాదు మేరకు వార్డెన్ భర్త రవిపై ఫోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.