Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు ఎయిరిండియా విమానాలు రద్దయ్యాయి. మొత్తం ఎనిమిది విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. తిరుపతి, బెంగళూరు, మైసూర్, హైదరాబాద్ విమానాలు రద్దు చేసినట్లు వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన యాజమాన్యం.. టికెట్ డబ్బులను ప్రయాణికులకు రీఫండ్ చేసింది.