Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సొంత స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(61), ఫాఫ్ డూప్లెసిస్(78)తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి కోహ్లీ ధనాధన్ ఆడడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ పడకుండా 56 రన్స్ చేసింది. లక్నో బౌలర్లపై విరుచుకు పడిన కోహ్లీ 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కోహ్లీ ఔటయ్యాడు. దాంతో, 96 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌తో కలిసి స్కోర్ వేగం పెంచాడు. వీళ్లు రెండో వికెట్‌కు వంద రన్స్ రాబట్టారు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలా ఒక వికెట్ తీశారు.