Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ
భార్య మీది కోపంతో ఇద్దరు కూతుళ్లకు కూల్‌డ్రింక్‌లో కలిపి విషమిచ్చిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామంలో చోటుచేసుకొన్నది. పెద్ద కుమార్తె మృతిచెందగా, చిన్న కూతురు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. వివరాళ్లోకెళ్తే.. గ్రామానికి చెందిన గుండె శ్రీను, ధనలక్ష్మి దంపతులకు కూతుళ్లు నాగప్రియ(09), నందిని(05), కుమారుడు వర్షిత్ తేజ (04)ఉన్నారు.
శ్రీను మేస్త్రీ పని చేసేవాడు. పెళ్లి నాటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 6న ధనలక్ష్మి హనుమకొండకు వెళ్లగా, భార్య మీది కోపంతో శ్రీను ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి, అన్నం తినిపించాడు. చిన్నారుల పరిస్థితి విషమించడంతో శ్రీను జనగామ దవాఖానకు తరలించాడు. చికిత్స పొందుతూ నాగప్రియ సోమవారం మృతి చెందింది. మెరుగైన చికిత్సకు నందినిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో శ్రీను ఉన్నట్టు సమాచారం.