Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవతెలంగాణ - రాజస్థాన్: రాజస్థాన్ లో గత పాలకుల హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానంటూ పైలట్ ముందే ప్రకటించారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయడమేంటని పార్టీ ప్రశ్నించినా పైలట్ వినిపించుకోలేదు. దీక్ష చేస్తే పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడినట్లేనని, చర్యలు తప్పవని హెచ్చరించినా లెక్క చేయలేదు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరూ కూడా ఆయనతో కలిసి వచ్చే పరిస్థితి లేదని సమాచారం. అయినప్పటికీ నిరసన చేపట్టేందుకే పైలట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.