Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రామంతాపూర్ ఘోరం చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కిరాతకంగా చంపాడు కసాయి కొడుకు. రామంతపూర్ వివేక్ నగర్ కి చెందిన పాండు సాగర్ కి గత ముపై సంవత్సరాల క్రితం వివాహమైంది. పవన్, సాయి ప్రశాంత్, యశ్వంత్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రామంతపూర్ లో టెంట్ హౌస్ నిర్వహిస్తుంటాడు పాండు సాగర్. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. పాండు సాగర్ నాలుగు సంవత్సరాల క్రితం పీర్జాధిగూడకి చెందిన విజయ లక్ష్మిని రెండోవ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రెండో భార్య విజయ లక్ష్మి తోనే ఉంటున్నాడు. మొదటి భార్య వద్ద వెళ్లకుండా రెండో భార్య వద్దనే ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే.. టెంట్ హౌస్ సామానును పెట్టడానికి శ్రీనివాసపురంలో ఒక అపార్ట్మెంట్ లో రెంటు తీసుకున్నాడు. ఆ అపార్ట్ మెంట్ వద్దకి మొదటి భార్య కుమారుడు పవన్ అక్కడకు వచ్చాడు. డబ్బులు అవసరమని కవాలని గొడవకు దొగాడు. అయితే తండ్రి తన వద్ద ఒక్కరూపాయి కూడా లేదని, ఒక వేళ వున్నా నీకు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు పవన్ తండ్రిపై దాడికి దిగాడు. టెంట్ హౌజ్ నుండి తెచ్చిన సుత్తితో తండ్రి తలపై అతి దారుణంగా కొట్టి హత్య చేసాడు. పాండు సాగర్ అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన చేరుకున్న పోలీసులు పవన్ ను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.