Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఆదిపురుష్ చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ రాముని లుక్, తన ఆర్ట్ వర్క్‌ను చూసి కాపీ కొట్టారని ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ ఆరోపించాడు. ప్రభాస్ లుక్, తన ఆర్ట్ వర్క్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆదిపురుష్ మూవీ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన అనుమతి లేకుండా తన ఆర్ట్‌ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించాడు. ‘‘నేను భారత్‌కు చెందిన ఆర్టిస్ట్‌ని. రామాయణ ఇతిహాసంలోని శ్రీరాముడి రూపం కోసం నేను నా అన్వేషణను ప్రారంభించా. ఏడాది క్రితమే అది జరిగింది. అయితే.. ఆదిపురుష్‌లో పనిచేస్తున్న ఆర్టిస్ట్, నా కళను కాపీ కొట్టారు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నా ఆర్ట్‌ని కాపీ కొట్టి, రాముడి రూపాన్ని ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ వైఫల్యానికి ఇదొక కారణం. ప్రాజెక్ట్‌పై పని చేసే వ్యక్తులకు అభిరుచి, ప్రేమ లేకపోవడం వల్లే ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని ప్లే చేస్తున్నారు. అయితే.. వాళ్లు దీన్ని పెద్దగా పట్టించుకోరని నాకు తెలుసు’’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు.