Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంబేద్కర్ కోనసీమ
జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.. అంబాజీపేట, పుల్లేటికుర్రులో బాలికపై అకృత్యానికి పాల్పడ్డారు పాస్టర్ బెజవాడ హోసన్న. బాలికను గర్భవతిని చేసి పుట్టిన బిడ్డను మాయం చేశాడు. పుల్లేటికుర్రు శివారు చీకురుమిల్లివారి పేటలో పాస్టర్ బెజవాడ హోసన్న నిర్వహించే చర్చిలో సభ్యురాలిగా 17 ఏళ్ల బాలిక ఉంది. తల్లి లేని బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు పాస్టర్.
ఈ క్రమంలో గత నెల ఐదున మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన పాపం బయటపడకుండా ఆ బాలికకు పుట్టిన వెంటనే బిడ్డను మాయం చేశాడు. నెల రోజులు గడుస్తున్నా బిడ్డ ఆచూకీ లేకపోవడంతో బాలిక బంధువులు అనుమానం వ్కక్తం చేశారు. బిడ్డను అమ్మేసి ఉంటాడని లేదా చంపేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మగశిశువు ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని బాలిక బంధువులు కోరుతున్నారు.