Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కామారెడ్డి
కామారెడ్డిలో సైబర్ మోసం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఈ తరుణంలో బ్యాంక్ అధికారులం మాట్లాడుతున్నామని నమ్మబలికారు.
ఆ తరువాత నాగరాజు మొబైల్ నంబర్‌కు ఓటీపీని పంపించారు. ఓటీపీ ఓపెన్ చేయగానే క్రెడిట్ కార్డ్ నుంచి 19,999 వేలు డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న నాగరాజు కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.