Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలోని దమ్మంపేట మండలం వడ్లగూడెంలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణకు దిగగా తెల్లాసరికి భార్య విగతజీవిగా పడి ఉంది. వడ్లగూడెంలో నాగేంద్ర బాబు, మోనిక దంపతులు నివాసముంటున్నారు. వీరిరువురూ తరచు గొడవపడుతూనే ఉంటారు.
ఈ తరుణంలో గత అర్ధరాత్రి కూడా భార్యభర్తలు ఇద్దరు గొడవకు పాల్పడ్డారు. చివరకు ఏం జరిగిందో తెలియదు కానీ భార్య చనిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని దమ్మపేట ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. అయితే మోనికను భర్త నాగేంద్రబాబు కావాలనే చంపాడని మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మోనిక భర్త నాగేంద్ర బాబుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.