Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాట్నా: ఏటీఎం వ్యాన్ డ్రైవర్ సుమారు కోటిన్నర నగదుతో పరారీ అయ్యాడు. ఈ ఘటన బీహార్‌లోని పాట్నా నగరంలో ఉన్న దన్‌కా ఇమ్లీ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. జీపీఎస్ ద్వారా వ్యాన్ నిలిపిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న 1.5 కోట్ల క్యాష్ బాక్స్ కనిపించడం లేదు. పాట్నాలో ఉన్న దన్‌కా ఇమ్లీ చౌక్ వద్దకు ఏటీఎం సిబ్బంది క్యాష్‌ను నింపేందుకు వచ్చారు. కస్టోడియన్ అమ్రేవ్ కుమార్ సింగ్, క్యాషియర్ సోనూ కుమార్, దిలీప్‌కుమార్, గన్‌మెన్ సుభాష్ డ్రైవర్ సూరజ్ కుమార్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌కు మధ్యాహ్నం 3.30కి చేరుకున్నారు. డిపాజిట్ మెషీన్లలో ఉన్న నగదును తీసి, ఏటీఎం విత్‌డ్రా మెషీన్లలో పెట్టాల్సి ఉంది.
అయితే దన్‌కా చౌక్ వద్ద పార్కింగ్ సమస్య రావడంతో.. డ్రైవర్ సూరజ్ వాహనాన్ని కొంత దూరంలో పార్క్ చేశాడు. కస్టోడియన్, క్యాషియర్ ఇద్దరూ బ్యాంక్‌లోకి వెళ్లి అరగంట తర్వాత తిరిగి వాహనం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో క్యాష్ వ్యాన్‌తో పాటు సూరజ్ కనిపించకపోవడంతో పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరజ్‌ను ఫోన్లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరకు జీపీఎస్ ద్వారా వాహనాన్ని పోలీసులు ట్రాక్ చేశారు. వాహనాన్ని ఖాళీగా గుర్తించారు. డ్రైవర్ మిస్సింగ్‌లో ఉన్నట్లు తేల్చారు.