Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నిజామాబాద్: మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటి వద్ద సందీప్ వర్మ అనే వ్యక్తి హంగామా సృష్టించాడు. కారుతో ఇంటి గేటు, వాహనాలను ధ్వంసం చేశాడు. సుమారు 20 నిమిషాలపాటు సందీవ్ వర్మ రచ్చ చేశాడు. అసలు ఏం జరగుతుందో తెలియక సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా డీఎస్ తనయులు అరవింద్, సంజయ్‌ల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరికీ రాజకీయంగా పడట్లేదు. తండ్రి డి శ్రీనివాస్‌తోపాటు సంజయ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సంజయ్ తమ్ముడు, బీజేపీ ఎంపీ అరవింద్‌కు ఇది నచ్చట్లేదు. తండ్రిపై ఒత్తిడి తీసుకొచ్చి మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేయించారు. దీన్నంతా అరవింద్ కుట్రగా సంజయ్ చెప్పారు.