Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌కి మరో బెదిరింపు కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి ఈనెల 30వ తేదీన సల్మాన్‌ని చంపేస్తానని ఒక వ్యక్తి బెదిరించాడు. ఈ తరుణంలో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ వ్యక్తి ‘గో-రక్షక్’ విభాగానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. దీంతో ఈ బెదిరింపు ఫోన్ కాల్ రాగానే అప్రమత్తమైన పోలీసులు, సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీస్ కంట్రోల్ రూమ్‌కి నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనని తాను రాకీ భాయ్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందినవాడినని కూడా అతడు పేర్కొన్నాడు. ఈ నెల 30వ తేదీన సల్మాన్ ఖాన్ని చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే మేము కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం. సల్మాన్ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశాం. ప్రస్తుతం ఆ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం. మా ప్రాథమిక విచారణలో భాగంగా అతడు గో-రక్షక్ విభాగానికి చెందినవాడిగా తేలింది. ఈ ఫోన్ కాల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టాం’’ అంటూ ముంబై పోలీసులు తెలిపారు.