Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
జీవితపై విరక్తి చెందిన ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబంలోని తండ్రి, భార్య, కూతురు ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఈ తరుణంలో గమనించిన రైల్వే పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో తండ్రి పద్మనాభం, భార్య సెల్వి, కుమార్తె జీవితకు గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.