Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కస్టడీ, బెయిల్ దరఖాస్తులపై మంగళవారం హనుమకొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరింత విచారణ నిమిత్తం ప్రధాన నిందితుడు బండి సంజయ్‌తో పాటు ఏ2, ఏ3 భూర ప్రశాంత్, గుండెబోయిన మహేశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 6న న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, బండి సంజయ్ తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆరెస్టయిన ఐదో తేదీన దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పోలీసులు ఐదో నిందితుడు ఎం.శివగణేశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కస్టడీ పిటిషన్లపై హనుమకొండ జిల్లా నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థాన ఇన్‌ఛార్జి న్యాయమూర్తి, రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ షేక్ అరీఫ్ సోమవారం వాదనలు విన్నారు. అంతే కాకుండా ముగ్గురు నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తులపైనా వాదనలు విన్నారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేశ్, ఏ5 శివగణేష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.