Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము స్టీల్ ప్లాంట్ వయబులిటీ గురించే ఆలోచిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ టెండర్లో చాలా పరిమితులు ఉన్నాయని, విశాఖ స్టీల్‌ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని సజ్జల అన్నారు.
విశాఖ ఉక్కు ప్రయివేటుపరం కాకుండా అడ్డుకోవాలని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించిన తరునంలో దాని బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిశ్చయించింది. అయితే గత నెల 27న ఈవోఐ విడుదల అయింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ క్రమంలో తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.