Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేసే యూపీఐ చెల్లింపుల మొత్తాన్ని నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే యూపీఐ ద్వారా ఏ వస్తువునైనా కొనుగోలు చేసినా ఆ మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చన్నమాట. ఐసీఐసీఐ బ్యాంక్ అందించే ‘పే లేటర్’ వినియోగదారులకు ఈ సదుపాయం లభిస్తుంది.
ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటికి ఈ ఈఎంఐ సదుపాయం వర్తిస్తుంది. ఆన్లైన్ పేమెంట్లకూ త్వరలో ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఐసీఐసీఐ బ్యాంక్ భావిస్తోంది. రూ.10 వేల కంటే ఎక్కువ మొత్తాలను ఈఎంఐ కింద మార్చుకోవచ్చు. యూపీఐ పద్ధతిలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారని, అందులోనూ ఐసీఐసీఐ అందించే బై నౌ పే లేటర్ సర్వీసులను ఇటీవల కాలంలో ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని గమనించి ఈఎంఐ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ ఛానల్ అండ్ పార్ట్నర్షిప్ హెడ్ బిజిత్ భాస్కర్ పేర్కొన్నారు.