Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముస్లిం ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. చాపెల్ రోడ్, నాంపల్లి నుంచి వచ్చే వాహనదారులు బీజేఆర్ విగ్రహం వద్ద ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా మళ్లించనున్నారు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ వైపు మళ్లించనున్నారు. రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనదారులను సుజాత స్కూల్ వైపు మళ్లించనున్నారు. బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద కుడి వైపునకు అనుమతించరు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ మీదుగా చాపెల్ రోడ్ వైపు వెళ్లాలి.
నారాయణగూడ సెంటినరీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వెహికల్స్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లించనున్నారు. కింగ్ కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి క్రాస్ రోడ్స్ వద్ద తాజ్‌మహల్ హోటల్ వైపు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.