Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్ టీంను నిషేదించాలంటూ తమిళనాడు అసెంబ్లీలో పీఎంకే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన ఒక్క ప్లేయర్ కూడా జట్టులో లేని టీం ఎందుకని పీఎంకే ఎమ్మెల్యే ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు. స్థానిక ఆటగాళ్లు లేకపోవడం దారుమన్నారు. రాష్ట్రంలో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వారికి ఐపీఎల్లో ఆడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. తమిళనాడు క్రీడాశాఖ దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. క్రీడల పేరిట చెన్నై టీం వ్యాపారం చేస్తోందని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెన్నై టీంపై చర్యలు తీసుకోవాలని పీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.