Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిత్తూరు: ఆల్ చిత్తూరు చెస్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదిన అండర్-17 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు స్థానిక ఓటీకే రోడ్డులోని గురునాధ థియేటర్ వద్ద ఉన్న ప్రీతమ్ హాస్పిటల్లో జరుగుతుందన్నారు. ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1 2006 తర్వాత జన్మించినవారై ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల లోపు తమ పేర్లు నమోదు చేసుకొవాలని కోరారు.