Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మిసెస్ ఇండియా కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్ సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చిలోని లీ మెరెడియల్ హోటల్లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టేసి అంకిత ఠాకూర్ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఈమె స్వస్థలం హైదరాబాద్. మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచి కిరీటంతోపాటు రెండు టైటిల్స్‌ను సైతం గెలుచుకుంది. గతంలో మిసెస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన రశ్మిక ఠాకూర్ శిక్షణలో అంకిత ఠాకూర్ తెలంగాణ ప్రతినిధిగా అందాల పోటీలో పాల్గొన్నది.