Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈఏపీసెట్-2023) పరీక్షలు మే 15న మొదలౌతాయని సెట్ నిర్వాహక కమిటీ చైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ జింకా రంగజనార్దన తెలిపారు. జేఎన్టీయూలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 11 నుంచి ప్రారంభం కాగా ఈనెల 15 వరకు స్వీకరిస్తున్నామని, పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఆన్‌లైన్‌ద్వారా జరుగుతోందన్నారు. మే 9 నుంచి హాల్‌టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ విద్యార్థులకు మే 15 నుంచి, అగ్రికల్చర్‌కు మే 22 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రఽథమ సంవత్సరం పాఠ్యాంశాలలో 70 శాతం, ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలలో వందశాతం పరిగణనలోకి తీసుకుని, ఈఏపీసెట్ ప్రశ్నపత్రం రూపకల్పనచేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 రీజినల్ సెంటర్స్‌ను, తెలంగాణలోని హైదరాబాద్‌లో రెండు రీజినల్ సెంటర్స్‌ను గుర్తించామని తెలిపారు. రీజినల్ సెంటర్ల పరిధిలో ఏర్పాటుచేసే పరీక్షా కేంద్రాల సంఖ్యను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈఏపీసెట్ మార్కులకు 25 శాతం మెయిటేజీతో ఇంటర్ మార్కులు కలిపి ర్యాంకులు ఇస్తామని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఈఏపీసెట్ ద్వారా బైపీసీ స్ర్టీమింగ్‌లో ప్రవేశాలు కల్పించబోతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఈఏపీసెట్-2023కు మంగళవారం వరకు 2,80,779 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ఇంజనీరింగ్‌కు 1,42,049 మంది, అగ్రికల్చర్‌కు 1,38,730 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షల తర్వాత ఈ ఏడాది అందుబాటులో ఉండే సీట్ల సంఖ్యను వెల్లడిస్తామని చెప్పారు.