Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చండీగఢ్: పంజాబ్లో ఓ సైనిక శిబిరంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు వినిపించగానే స్టేషన్లోని క్విక్ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.