Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ: నల్లగొండ పట్టణంలో అర్ధరాత్రి దొంగల ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించింది. లక్ష్మి నివాస్ అపార్ట్మెంట్లోని కమ్యూనిటీ హాల్, జీ8 ఫ్లాట్ల తాళాలు పగలగొట్టారు. మొదటి అంతస్తు మొత్తం కలియతిరిగారు. నాలుగు ఇళ్లకు తాళాలు పెట్టి వెళ్లారు. అలాగే పక్కనే ఉన్న రెండు కాలనీల్లో దొంగలు తిరిగారు. కొద్ది రోజుల కిందట.. అపార్ట్మెంట్ పక్కన ఉన్న కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. మంగళవారం రాత్రి మాత్రం నలుగురు దొంగల ముఠా సభ్యులు మాత్రం ఓ బస్త సంచిలో కత్తులు, ఆయుధాలు తీసుకొచ్చారు. వాటితోనే తలుపుల తాళాలు కట్ చేశారు. దొంగలు తిరుగుతున్న దృష్యాలు అపార్టుమెంట్లలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్మెట్లను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.