Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మంగళవారం నాడు జానారెడ్డి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్ళి మోకాలి చికిత్స కోసం ఆయన వైద్యులను కలిశారు. ఈ తరుణంలోనే పరీక్షలు నిర్వహించిన వైద్యులుగుండె రక్తనాళాల్లో ఒకటి పూర్తిగా పూడుకుపోయిందని గుర్తించారు. ఇదే విషయం జానారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వివరించారు. వారి అనుమతితో మంగళవారం రాత్రి స్టెంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.