Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్ నగర్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్కు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టగా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.