Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మన్ కేశుబ్ మహీంద్రా (99) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంఅండ్ఎం మాజీ ఎండీ పవన్ గోయెంకా ధ్రువీకరించారు. కంపెనీ అధికార ప్రతినిధి సైతం ఓ ప్రకటనను విడుదల చేశారు. కేశుబ్ మహీంద్రా 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవలే వెలువడిన ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 1.2 బిలియన్ డాలర్ల సంపదతో భారత్‌లో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా నిలిచారు. 1947లో కంపెనీలో చేరిన కేశుబ్.. సంస్థను అనేక రంగాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యాపారంలోకి ప్రవేశించిన నాటికి కంపెనీ ప్రధానంగా విల్లీస్ జీప్లను తయారు చేస్తుండేది. ఇప్పుడు మహీంద్రా గ్రూప్ వాహన, ఇంధనం, సాఫ్ట్వేర్ సేవలు, స్థిరాస్తి, ఆతిథ్యం, రక్షణ.. ఇలా పలు రంగాలకు విస్తరించింది.