Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని మహిళపై దుండగులు లైంగికదాడి చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. స్థానిక ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ-శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ సంచి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. సంచిని విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉంది. దుండగులు లైంగికదాడి చేసి గొంతునులిమి.. ఆపై నిప్పంటించి హతమార్చినట్లు ఘటనాస్థలిలో పరిస్థితులను బట్టి అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.