Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేటలో బుధవారం ప్రయివేటు స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. కోకాపేట్ సర్కిల్ వద్ద వేగంగా వచ్చి అదుపుతప్పిన స్కూల్ బస్, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 18 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.