Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
నవతెలంగాణ - డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని దారుణం చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో బాలుడి కాలు తెగిపోయింది. ధర్మారం బి గ్రామానికి చెందిన అద్నాన్ ధర్మారం బి గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి బాలుడు తల్లి, నానమ్మతో కలిసి డిచ్ పల్లి రైల్వే స్టేషన్ కు వచ్చారు. అయితే అప్పటికే హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న రైలు బోగీలో ఎక్కి నానమ్మతో పాటు బాలుడు రైల్లో కూర్చున్నాడు. రైలు టికెట్ తీసుకొని రావడానికి తల్లి కౌంటర్ వద్దకు వెళుతుండగా బాలుడు ఒకసారిగా రైల్లో ఎక్కిన తర్వాత దిగబోతు కిందపడిపోయాడు.
క్షణిక కాలంలో ప్లాట్ఫారం రైలు మధ్యలో ఇరుక్కు పోవడంతో అదే క్షణంలో రైలు ముందు కదలడం వల్ల బాలుడి ఎడమ కాలు పాదం భాగం తెగిపడి పోయింది. దీనిని గమనించి స్థానికులు వెంటనే డిచ్ పల్లి స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి సమాచారం అందించి అప్పుడే కదులుతున్న రైలును వైర్లెస్ సెట్ ద్వారా రైల్ ను వేంటనే ఆపారు. స్థానికులు తీవ్ర గాయాల పాలైన బాలుని బయటకు తీసి చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.