Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నటి సమంత స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. వరుస షూటింగ్స్, ప్రమోషన్స్‌తో గత కొన్నిరోజుల నుంచి ఫుల్ బిజీగా ఉన్న ఆమె జ్వరంతో ఇబ్బందిపడుతున్నట్లు తాజాగా ట్వీట్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరగనున్న 'శాకుంతలం' ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని వెల్లడించారు. 'ఈ వారం అంతా మీ మధ్య ఉండి.. మా చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ప్రేమాభిమానాలను పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వరుస ప్రమోషన్స్, షూటింగ్ షెడ్యూల్స్ వల్ల దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నా. ఈ రోజు సాయంత్రం ఎంఎల్ఆర్ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. మా టీమ్‌తో కలిసి మీరూ పాల్గొనండి. మీ అందర్నీ నేను మిస్ అవుతున్నా' అని సామ్ పేర్కొన్నారు.